A Women Story : స్త్రీ అంటే బానిసేనా?
ఒక స్త్రీ ఎప్పటివరకు మీదానిగా ఉంటుంది తెలుసా మీకు?
చాలామందికి ఉన్న దురభిప్రాయం ఏంటంటే ఆడవారు శారీరకంగా బలహీనులు మానసికంగా బలవంతులు అనుకుంటారు నిజానికి స్త్రీ శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా బలహీనురాలు.
అందుకే స్త్రీ చాలా విషయాల్లో మానసికంగా పురుషుడి మీద ఆధారపడుతుంది నిజానికి ఏ స్త్రీకి శారీరకంగా ఏ మనిషి తోడు అవసరం లేదు కానీ మానసికంగా తన అభిప్రాయాలు వెళ్లబుచ్చడానికి, తన కల లని నిజాం చేసుకోవడానికి ,తన అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒక తోడు కోరుకుంటుంది ఆ తోడు జీవిత భాగస్వామి కావచ్చు లేదా ఆమెకు పరిచయమయ్యే ఇతర వ్యక్తులైనా కావచ్చు.
అలా పరిచయమైన వ్యక్తితో స్త్రీ ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ వ్యక్తికి చేరవేస్తుంది అతని నిర్ణయమే తన నిర్ణయంగా మార్చుకుంటుంది అలా మార్చుకునే క్రమంలో స్త్రీ తనకి తెలియకుండానే అతనికి బానిసగా మారిపోతుంది అలా అతని మనిషిగా ఉన్న స్త్రీకి ఎటువంటి ఆలోచన ఉండదు ఆ పురుషుడి తన ప్రపంచం గా బతుకుతుంది.
అయితే కొంతమంది మగవారు ఏం చేస్తారు అంటే ఇలా బానిసగా బతుకుతున్న స్త్రీని మరింత పాతాళానికి పంపిస్తూ ఉంటారు,అలా పంపే క్రమంలో స్త్రీ బలహీనమైన స్థితి నుంచి బలవంతురాలిగా మారుతుంది అలా బలవంతురాలిగా మారిన స్త్రీని భరించడం ఏ మగవాడి వల్ల కాదు అందుకే ఆమెకి అహంకారి అనే ముద్ర నీ వేస్తాడు.

నిజానికి స్త్రీ మగవాడి దగ్గర సుఖాన్ని కోరుకోదు ఆమె మానసిక స్వంతన కోరుకుంటుంది అటువంటి మానసిక స్వంతనని ఇచ్చిన పురుషుడికి ఆమె బానిసగా మారుతుంది అతడు చేసే ప్రతి పనిని ఆమె స్వాగతిస్తుంది, అవమానాలని కూడా భరిస్తుంది, ఎప్పుడైతే స్త్రీ పురుషుడి నుంచి మానసిక స్వంతలను పొందలేకపోతుందో అప్పుడు ఆ స్త్రీ తనను తాను ఓదార్చుకోవటం నచ్చచెప్పుకోవటం ఇండిపెండెంట్ ఉమెన్ గా మారడం కొంచెం కొంచెంగా పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగల ఒక పూర్తి ఇండిపెండెంట్ ఉమెన్ గా మారుతుంది అలా మారిన స్త్రీ ఏ పురుషుడిని లెక్క చేయొద్దు.
తను స్వతంత్రంగా ఆలోచిస్తుంది
స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది
తనకు తాను ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది
ఇప్పుడైతే స్త్రీ ఇవన్నీ చేయగలుగుతుందో అప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుడి నుంచి దూరంగా జరుగుతుంది ఇప్పుడు ఆ స్త్రీ మీది కాదు. మీరు ప్రేమించే ఆమె మీదానిగా ఉండాలి అనుకుంటే ఆమెకు మీరు మానసిక స్వంతనని అందజేయండి అప్పుడు ఆమె ఎప్పుడు మి కనుసన్నల్లో ఉంటుంది. ఆడవాళ్లు అందరు మగాడి డబ్బులే కోరుకుంటారు అనుకోకండి, కొందరు మి ప్రేమ అభిమానం, మి సంతోషం కోరుకునే వారు కూడా ఉంటారు, ఇలాంటివి కోరుకునే వారు మీకు దొరకక పొతే అది మి దురదృష్టం, అంతే గాని అందరు అలానే ఉంటారు అనుకోవద్దు.
@DevilWrites
Content Credits : Social Media

.jpg)

Comments
Post a Comment