Posts

Collector Story : మనుషులను మనీతో కాదు మనసుతో చూడాలి !

Image
కొంచెం చిరిగిన పంచ , కాస్త చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీ కోసం ఏమి తీసుకు రావాలి? అని ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, ఈ ఊరిలోని పెద్ద హోటల్‌లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను " మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకు రండి అని చెప్పగానే , దానికి "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకు రావాలి? అని "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు" అని మొత్తం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు , "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అని వెయిటర్ అన్నాడు. అప్పుడు యజమాని ఇలా అన్నాడు , "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దా...

An Old Man Story : మార్పు మన నుండే ప్రారంభం కావాలి!

Image
హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు , భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు , చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు , నా చేతిలో ఈవే ఉన్నాయి. వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు, ఉత్తి అన్నమైనా ఫరవాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు, నిన్నటి నుండి ఏమీ తినలేదు, ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి , గొంతు వణుకుతోంది, హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను. ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు. మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు. నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి , నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి , నేను కూడపెట...

Money Story : డబ్బుకి లోకం దాసోహం..

Image
నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్న , నాలుగు గంటలు మనం ప్రశాంతం గా పడుకోవాలి అన్న, నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్న, మన దగ్గర ఉండాల్సింది డబ్బు . పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే , ఐనా వాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే. కట్నం డబ్బులు తీసుకురాని భార్యని బానిసగా చూస్తాడు భర్త , ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది భార్య , డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రి ని అసమార్థులుగా చూస్తారు బిడ్డలు, సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి, డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడుతుంది. అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు . ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు. పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు. అందుకే డబ్బుని గౌరవించండి , పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన, మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి. డబ్బుకి లోకం దాసోహం ..పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు మరి! @DevilWrites Content ...

Relations Story : బంధాలు బలహీనం గా మారడానికి కారణం !

Image
బంధాలు బలహీనం గా మారడానికి కారణం ఏమిటి ? ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం , నాకు కనిపించిన కారణాలు ఇవి అభద్రత ! ఒక మనిషిని ఎక్కువ ఆరాధించినప్పుడు అభద్రత భావం ఎక్కువ అవుతుంది, సొంతం అయినా బంధాలలో కన్న మిగిలిన వాటిలో ఈ అభద్రత భావం ఎక్కువ ఉంటుంది, ఇద్దరు దూరం గా ఉండటం ఇద్దరి మధ్య బలమైన గుర్తింపు కలిగిన బంధం లేకపోవడం, సమాజం లో తమ బంధానికి ఆమోదయోగ్యం లేకపోవడం ఈ అభద్రత భావం ఎక్కువ అవ్వడానికి కారణాలు , ఆభద్రత ఎక్కువ అయ్యి క్రమం గా బంధం బలహీనం అవుతుంది. అనుమానం ! చాలా మంది ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది అంటారు,అనుమానించాలి కూడా అంటారు నిజానికి అది అబద్దం నీ ప్రేమ నిజం ఐతే నిది ఎప్పటికి నీదే దానికోసం ఎవరు రారు రాలేరు, మధ్యలో ఎవరు ఇనా వచ్చారు అంటే ప్రేమ ఎక్కడ ఉన్నట్టు లేనట్టే అనుమానం మొదలు అనేది బంధం బీటలు వారడానికి మొదటి అడుగు పడినట్టే . అవమానం ! చాలా మంది మాట్లాడేటప్పుడు మాట జారేస్తారు, తొందరలో కొన్ని సార్లు చులకనగా కొన్ని సార్లు, మనం అనే ప్రతిమట నీ ఎదుటివారు తీసుకునే పరిస్థితులలో ఉన్నారో లేరో కూడా ఆలోచించారు అనేస్తారు బంధాన్ని కలిపేది మాటే బంధాన్ని తెంచేది మాటే నాలుగు గోడల మధ్య అపురూపం గా చూసుకొని నలు...

Ratan Tata Love Story : రతన్ ఓ విశిష్ట వ్యక్తి!

Image
  అవునూ… ఆ అమెరికన్ అమ్మాయి మళ్లీ రతన్ టాటా లైఫ్‌లోకి వచ్చిందా..? కారణాలు ఏవయితేనేం… కొన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు… కొందరు ప్రేమ వేరు, పెళ్లి వేరు అని భావించి, ఆ రెండింటి నడుమ గీత గీసేస్తారు… పెళ్లి అనంతరం ప్రేమ సన్నగిల్లుతుందనే సందేహంతో..! ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలూ చేసుకున్న సంఘటనలు కోకొల్లలు… బ్రేకప్ తరువాత పగను పెంచుకునే వాళ్లూ అంతే… ఇప్పుడు లవ్వులు, బ్రేకప్పులు కామన్ అయిపోతున్నాయి కదా… ఫ్రెండ్స్‌లా విడిపోదాం, ఫ్రెండ్స్‌లాగే ఉందాం అని బ్రేకప్ అనంతరం రిలేషన్స్ కూడా మెయింటెయిన్ చేస్తుంటారు… అవునూ… మనం రతన్ టాటా గురించి చాలా స్టోరీస్ చదివాం కదా… బ్రహ్మచారే గానీ తనకూ ఓ లవ్ స్టోరీ ఉందని… అనివార్యంగా అది పెళ్లి దాకా రాలేదని… నా జీవితంలో మహిళలు లేకుండా లేనని తనే చెప్పాడని… ఇలా కథలు చదివాం కదా… అందులో ఒకటి తన ఫస్ట్ లవ్… అమెరికాలో తను చదువుతున్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమ, పెళ్లి దాకా వచ్చింది… ఆమె ఇండియాకు రావల్సి ఉంది… ఈలోపు చైనా- ఇండియా వార్ మొదలైంది… గ్రాండ్‌మా అనారోగ్యం రీత్యా రతన్ ఇండియాాకు వచ్చాడు… ఈలోపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించడానికి ఇష్టపడలేదు… రతన్ అమెరికాకు వెళ్ల...

Station Story : ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్ డేటెడ్

Image
రైల్వే స్టేషన్ లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు. పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు. ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.మేము విజయవాడ వెళుతున్నాం. మరి మీరో అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని . మేమూ విజయవాడ వరకే అని చెప్పి మీకు రిజర్వేషన్ వుందా అని అడిగాడు మద్యవయసాయన. ఆ ఉందండీ మా అబ్బాయి చేశాడు. S5 లో చెప్పాడు పెద్దాయన. అరే మాది కూడా S5 బోగీనే అన్నాడు, వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు. 'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన, ఆ పెద్దాయనని పుస్తకం అట్ట చూపిస్తూ "రామాయణం" చెప్పాడు పెద్దాయన. 'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన. 'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.' 'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంటా' అన్నాడు మద్యవయసాయాన. ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు. రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.త్వరగా రైలు ఎక్కే...

Couple Story : అన్యూన్య దాంపత్యం!

Image
నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునేవారికి నువ్వు దగ్గరున్నా,దూరంగా ఉన్నా..,, మాట్లాడినా,మాట్లాడకపోయినా..,, నువ్వు బాగున్నా,బాగోలేకపోయినా..,, అసలు నువ్వు ఉన్నా,లేకున్నా ఒకటే కదా!! అలాంటివారి కోసం నువ్వెందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. అలాంటివారి కోసం నువ్వెందుకు తల పగిలేలా ఆలోచిస్తున్నావు. అలాంటివారి కోసం నువ్వెందుకు గుండెలవిసేలా ఏడుస్తున్నావు. అలాంటివారి కోసం నువ్వెందుకు నీ మనసుని కష్టపెడుతున్నావు. అలాంటివారి కోసం నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు. పోతే పోనీ.. ఉంటే ఉండనీ.. ఏది శాశ్వతం కాదు. కుండలో వండుకున్న అన్నం కడుపులోకి పోతుంది అనే గ్యారంటీ లేని బతుకులు మనవి. అంతమాత్రం దానికి నువ్వెందుకు బాధపడిపోతున్నావు. ఒక్కరోజులో రాలిపోయే పువ్వు అరే రాలిపోతున్నా అని బాధపడక నలుగురికి నయనానందాన్ని, పరిమళాలను పంచుతుంది. మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న నువ్వెంత ఆనందంగా ఉండాలో, నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!! గుర్తుంచుకో. @DevilWrites Content Credits : Social Media