Money Story : డబ్బుకి లోకం దాసోహం..


నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్న, నాలుగు గంటలు మనం ప్రశాంతం గా పడుకోవాలి అన్న, నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్న, మన దగ్గర ఉండాల్సింది డబ్బు.

పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే, ఐనా వాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే.


కట్నం డబ్బులు తీసుకురాని భార్యని బానిసగా చూస్తాడు భర్త, ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది భార్య, డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రి ని అసమార్థులుగా చూస్తారు బిడ్డలు, సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి, డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడుతుంది.

అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు. ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు. పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు.


అందుకే డబ్బుని గౌరవించండి, పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన, మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి.


డబ్బుకి లోకం దాసోహం..పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు మరి!


@DevilWrites








Content Credits : Social Media

Comments