Couple Story : అన్యూన్య దాంపత్యం!
నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునేవారికి
నువ్వు దగ్గరున్నా,దూరంగా ఉన్నా..,,
మాట్లాడినా,మాట్లాడకపోయినా..,,
నువ్వు బాగున్నా,బాగోలేకపోయినా..,,
అసలు నువ్వు ఉన్నా,లేకున్నా ఒకటే కదా!!
అలాంటివారి కోసం
నువ్వెందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు.
అలాంటివారి కోసం
నువ్వెందుకు తల పగిలేలా ఆలోచిస్తున్నావు.
అలాంటివారి కోసం
నువ్వెందుకు గుండెలవిసేలా ఏడుస్తున్నావు.
అలాంటివారి కోసం
నువ్వెందుకు నీ మనసుని కష్టపెడుతున్నావు.
అలాంటివారి కోసం
నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు.
పోతే పోనీ..
ఉంటే ఉండనీ..
ఏది శాశ్వతం కాదు.
కుండలో వండుకున్న అన్నం
కడుపులోకి పోతుంది అనే గ్యారంటీ లేని
బతుకులు మనవి.
అంతమాత్రం దానికి నువ్వెందుకు బాధపడిపోతున్నావు.
ఒక్కరోజులో రాలిపోయే పువ్వు
అరే రాలిపోతున్నా అని బాధపడక
నలుగురికి నయనానందాన్ని,
పరిమళాలను పంచుతుంది.
మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న
నువ్వెంత ఆనందంగా ఉండాలో,
నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో
ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!!
గుర్తుంచుకో.
@DevilWrites
Content Credits : Social Media

Comments
Post a Comment