Collector Story : మనుషులను మనీతో కాదు మనసుతో చూడాలి !
ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, ఈ ఊరిలోని పెద్ద హోటల్‌లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను "
మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకు రండి అని చెప్పగానే ,
దానికి "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకు రావాలి? అని
"అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు" అని
మొత్తం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు, "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అని వెయిటర్ అన్నాడు.
అప్పుడు యజమాని ఇలా అన్నాడు, "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనంద పడ్డాడు.
హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు, ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు, అ యజమాని వాళ్లకి మూడు దోశలుతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు. కొద్దిసేపటికి అతను, అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్ళారు. ఏళ్ళు గడిచి పోయాయి, ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్‌గా వచ్చింది.
ఆమె ముందుగా ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియ జేయమంది, హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంక రించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండి పోయింది. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లి దండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది, "మీరిద్దరూ నన్ను గుర్తించలేక పోవచ్చు. , కొన్నేళ్ల క్రిందట ఎవరి తండ్రికి అయితే మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే.
అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయి నందుకు ఒక అద్భుత మైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు. ఈ రోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్పూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను, మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ గుర్తుంచు కుంటాను.
ఈ రోజు ఈ పార్టీ నా తరపున ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను, అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను.
ఆ హొటల్ కు ఆ సరస్వతి పుత్రిక వున్న బంధం గురించి నలుగురికీ తెలిసింది హొటల్ వైభోగం
పదింతలంయ్యింది. అందుకే అంటారు చేసిన పుణ్యం, నాటిన మొక్క ఊరికే పోదు అని. ఈ సరస్వతీ పుత్రిక కూడా పేదరికంలో ఉండి, తన చదువు సంధ్యలతో, సంస్కార గుణంతో, పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్నన పొందగలిగింది.
అందుకే అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక.
అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది...!!
@Devil Writes
@Content Credits : Social media




Comments
Post a Comment