Mumbai Real Story : ఒక బ్యాంకు ఎంప్లాయ్ కథ!

ఇదీ ముంబైలో నిజంగా జరిగిన కథ ఇందులో అప్పటి స్టాక్ మార్కెట్ హవాలా దిగ్గజం హర్షాద్ మెహతా వలలో మోసపోయిన కొన్ని బ్యాంకుల్లో జరిగిన యదార్థ సంఘటనలను బేస్ చేసుకుని చక్కగా రూపు దిద్ది వ్రాసుకున్న ఒక బ్యాంకు ఎంప్లాయ్ కథ.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితులపై ఎన్నో సినిమాలు తెరకెక్కినా లక్కీ భాస్కర్ కథను మాత్రం దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకుడు ఫిదా అవుతాడు.

అంతేకాదు ఈ కథకు తొందరగా కనెక్ట్ అయ్యేలా కథనం కనిపిస్తుంది. ఫ్యామిలీ కోసం తపన పడే వ్యక్తి అదే ఫ్యామిలీ కోసం తప్పుడు మార్గంలోకి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. భాస్కర్ పాత్రపై జాలి కలిగిస్తూనే అతనేం చేసినా కరెక్ట్ అనేలా ఆడియన్స్ ను కథలో ఇన్వాల్వ్ చేసి కన్వీన్స్ చేసిన విధానం బాగుంది.


సీబీఐ అరెస్ట్‌తో కథ ఇంటెన్స్‌గా, సీరియస్ నోట్‌లో మొదలైనప్పటికీ.. వెంటనే ఫ్యామిలీ జోన్‌లోకి తీసుకెళ్లి సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చిన విధానంతోనే ప్రేక్షకులు బలంగా కనెక్ట్ అయిపోతారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటెలిజెంట్, బ్రిల్లియెంట్ స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్‌కు చేర్చింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగదీత అనిపించినా కొన్నిసన్నివేశాల్లో ఎమోషన్స్ జొప్పించిన విధానం సినిమాకు బలంగా మారింది. కొన్ని డైలాగ్స్‌తో కేక పెట్టించాడు దర్శకుడు.

ఎప్పటిలాగే దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో క్లాప్స్ కొట్టించేసాడు. తన నటనతో సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాస్కర్‌ క్యారెక్టర్ లో ఒదిగిన విధానం, ఆ పాత్రకు తగినట్టుగా మారిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్ని అద్బుతంగా అనేలా ఉంటాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరీకి మొదటిసారి మంచి పాత్ర దక్కింది. సుమతి కేరెక్టర్ లో ఆమె కనిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే.


సెకండాఫ్‌లో మీనాక్షి దుల్కర్‌తో పోటీపడి నటించింది. ఇంకా ఈ చిత్రంలో నటించిన సాయి కుమార్, సుధ,రాంకీ, కసిరెడ్డి రాజ్ కుమార్, హైపర్ ఆది తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నీకల్ గా.. జీవీ ప్రకాశ్ BGM సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్‌తో కేక పెట్టించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ సూపర్బ్. నిమిష్ రవి సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, సన్నివేశాలను రిచ్‌గా క్లాస్ టచ్‌తో కెమెరాలో బంధించారు. అంతేకాదు ఆర్ట్ వర్క్ కారణంగా సినిమా పీరియాడిక్ మూడ్‌ను ఎలివేట్ చేసింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

వెంకీ అట్లూరి కథను చెప్పిన తీరు, రాసుకున్న స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. డైలాగ్స్ మాత్రం గుండెల్ని తాకుతాయి. *డబ్బు సంపాదించడం అవసరం, ఇప్పుడు వ్యసనం* అంటూ తండ్రి చెప్పే డైలాగ్, *జూదం ఎంత గొప్పగా ఆడావ్ అన్నది కాదు, ఎప్పుడు ఆపాం అన్నది ముఖ్యం* అంటూ చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ మూవీ పై నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే ఈ సినిమాను సినిమాగా మాత్రమే చూడండి.


అంతే కానీ.. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఎవరైనా సరే పేద్ద గోతిలో పడతారు. ఎవరికైనా లక్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిసి వస్తుంది ఈ లక్కీ భాస్కర్ కి ప్రతీ చోట కలిసొస్తుంది అంటే... ఇలా సినిమాల్లో మాత్రమే జరుగుతుంది నిజ జీవితంలో జరగదు. అంత పెద్ద స్కామ్ వాలా 1990 లో ఈ హర్షద్ మెహతాను *స్టాక్ మార్కెట్ కా అమితాబ్* అని పిలిచేవారు.

అప్పట్లో ఇతగాడు చేసిన బ్యాంకుల మోసం ఇప్పటి కరెన్సీ విలువ ప్రకారం 24 వేల కోట్ల రూపాయల స్కామ్ అన్నమాట. మనిషి జీవితంలో అతి ఎక్కువైతే గతి తప్పక మానదు. ఎంతటి ఘనుడైనా అక్రమార్జనతో ఎక్కువ కాలం బ్రతకడు,బ్రతకలేడు కాలం మూడితే శ్రీ కృష్ణ జన్మస్థానమే దిక్కు అవుతుంది. సో బీ కేర్ ఫుల్.

@DevilWrites





Content Credits: Social Media

Comments