Know Yourself: నీ విలువ వీది కుక్క లెక్క?


అందరూ నిన్నే అర్ధం చేసుకోవాలి. నువ్వు ఎవ్వరినీ అర్ధం చేసుకోవు. అందరూ నీకే సహాయం చేయాలి నువ్వు ఎవ్వరికీ సహాయం చెయ్యవు. అందరూ నిన్ను గౌరవించాలి, నువ్వు ఎవ్వరినీ గౌరవించవు. ఇది కదా మనుషుల తెలివిమీరిన తనం.

నిన్ను ఆపద లో ఆదుకోలేదని అందరి మీద దుమ్మెత్తిపోస్తావు. నీవు ఎందరి ని ఆపద లో ఆదుకున్నావు? పది మంది ని సులభం గా మోసం చేయగలవు కానీ ఎంత కాలం ఎందరిని అని మోసం చేయగలవు?? కోటి అబద్దాలు చెప్పి బతకగలవు కానీ నీవు ఒక్క నిజం ముందు చివరికి తలెత్తుకోగలవా???



బతుకంతా నటనే ఐతే బతుకు చివరలో నీ రంగులు వెలిసి పోయి నువ్వు నువ్వు గా కనబడతావు చూడు అప్పుడు నిన్ను చేర దీసే వాళ్ళు ఎవ్వరు???
నిన్ను నీవు ప్రశ్నించుకో, నువ్వు సుఖం గా బతకడం కోసం పది మంది ని బాధ పెడితే, నీకు మిగిలే ఆనందం నీకు సంతృప్తి నిస్తుందా?



ఇంట్లో, ఆఫీస్ లో, వ్యాపారం లో, సమాజం లో, మనిషి ని మనిషి గా కాకుండా నీ కింద బానిస ల్లా పరిగణిస్తే, వేధిస్తే నీకు, నీ హోదా కు బయపడి, నిన్ను పైకి గౌరవిస్తారు ఏమో కానీ లోపల నీకు వీధి కుక్క కు ఇచ్చే విలువ కూడా ఇవ్వరు.


@DevilWrites







Content Credits : Social Media

Comments