Story of True Love : వాళ్ళు ఎక్కడైనా ఉంటారు!
పేదరికంలో ఉంటారు. రోజు ఆరుబయట వంట చేస్తూఉండేది ఆమె. ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు. భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది.
అలా భార్య తో ఒకరోజు మనం చేసేది కూలీ పనేకదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు. భర్త ను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామాను అంత సర్ది ఒక ఎద్దుల బండి లో వేసుకుంటారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు.అప్పుడు భార్య బైట పొయ్యి రాళ్లు 3ఉన్నాయి తెచ్చి బండి లో పెట్టండి అంటుంది. అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్లు అక్కడ ఉండవా అని.అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరా? కావాల్సింది నమ్మకం,మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడ కూడదు అంటుంది. భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటారు!
@DevilWrites
Content Credits : Social Media




Comments
Post a Comment